మధ్యంతరం ఖాయం: చంద్రబాబు
ఖమ్మం: కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు ఖాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. యుఎన్ పిఎను పటిష్టం చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు.
పార్టీకి రాజీనామా చేసినవారిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. పదవులిచ్చామని, గౌరవించామని, అయినా పార్టీని వదిలి వెళ్లిపోయారని ఆయన అన్నారు. కొంత మంది వెళ్లిపోయినా పార్టీ పటిష్టంగా ఉందని, మరింత పటిష్టమవుతోందని ఆయన అన్నారు. పార్టీలో సంక్షోభం వచ్చిన ప్రతిసారీ పార్టీ బలపడుతూ వస్తోందని ఆయన అన్నారు. పార్టీకి రాజీనామా చేసినవారిపై రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా వుంటే, తాజా జాతీయ రాజకీయాల నేపథ్యంలో బిఎస్పీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చంద్రబాబుతో ఫోనులో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
