మాయావతితో కారత్ భేటీ
న్యూఢిల్లీ: ఈ నెల 22వ తేదీన జరిగే బలపరీక్షలో యుపిఎ ప్రభుత్వానికి ఓటు వేయాలని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) నిర్ణయం తీసుకుంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆదివారంనాడు బిఎస్పీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని కలుసుకున్నారు. బలపరీక్ష సందర్భంగా పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఇటీవలి కాలంలో వారిద్దరు సమావేశం కావడం ఇదే తొలిసారి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయించుకోవడం మాయావతి విజ్ఞతకు నిదర్శనమని కారత్ ప్రశంసించారు.
అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కారత్ విలేకరులతో చెప్పారు. వామపక్షాలకు 50 మంది సభ్యులుండగా, బిఎస్పీకి 17 మంది సభ్యుల బలం ఉంది. మాయావతి కొంతమంది సమాజ్ వాదీ ఎంపిలను తన వైపు ఆకర్షించే పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనపై సిబిఐ తాజాగా అఫడవిట్ దాఖలు చేయడంపై ఆమె కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
