సానియా ప్రేమలో షాహిద్?
హైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో కలిసి తిరుగుతున్న మాట నిజమేనట. ఈ విషయాన్ని షాహిద్ కపూర్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చూచాయగా చెప్పాడు. సానియాతో డేటింగ్ నిజమేనని అతను చెప్పాడు. తాము స్నేహితులమని ఆయన చెప్పాడు. అది ప్రేమగా మారుతుందో లేదో చెప్పలేనని అతను అన్నాడు.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను పీకలోతు దాకా ప్రేమించి తర్వాత తెగదెంపులు చేసుకున్నాడు. అతను మరో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను ప్రేమిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే అది నిజం కాదని అతని ఇంటర్వ్యూను బట్టి అర్థమవుతోంది. అతను సానియా మీర్జాను ప్రేమిస్తున్నట్లు అతని మాటలను బట్టి తెలుస్తోంది. వివాహ్ సినిమా చూసిన తర్వాత షాహిద్ కపూర్ కు చాలా నచ్చాడట. అప్పటి నుంచి సానియా అతనితో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications
