రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొవ్వూరు సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రయాణికులతో కావలి నుంచి కొవ్వూరు వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా కొవ్వూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందినవారు. లారీ ఢీకొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఆటో డ్రైవరుతో సహా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు, రోడ్డుపై ఉన్న బిక్షగాడు ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications