కెసిఆర్ తో ఫెర్నాండెజ్ మంతనాలు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ బుధవారం ఫోన్ చేశారు. ఈ నెల 22వ తేదీన జరిగే బలపరీక్షలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని ఫెర్నాండెజ్ కెసిఆర్ ను కోరారు. కెసిఆర్ అందుకు సానుకూలంగా ప్రతస్పందించారు. తెరాసకు రెండు లోకసభ స్థానాలున్న విషయం తెలిసిందే. వాటికి తోడు నరేంద్ర ఓటు కూడా ఉంది.

కెసిర్ తో బహు జనసమాజ్ పార్టీ (బిఎస్పీ) నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మంగళవారం కెసిఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని ఆమె కెసిఆర్ ను కోరారు. కెసిఆర్ ఆ సమయంలో కూడా అనుకూలంగా ప్రతిస్పందించారు. కనీస ఉమ్మడి ప్రణాళిక (సిఎంపి)లో ఇచ్చిన హామీ మేరకు యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదని, అందువల్ల తెరాస బలపరీక్షలో మన్మోహన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం అవసరమని ఆమె కెసిఆర్ తో అన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కలిసి పనిచేద్దామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేద్దామని ఆమె కెసిఆర్ తో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+