22 ప్రభుత్వానికి ఆఖరి రోజు: సురవరం

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు అన్ని లౌకిక పార్టీలను కూడగడుతున్నట్లు ఆయన తెలిపారు. అణు ఒప్పందంపై ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ బేరసారాలకు దిగడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. తెరాస యుపిఎకు వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అన్నారు. కాంగ్రెస్, ప్రధాని ప్రతిష్టను దెబ్బ తీసే బేరసారాలను యుపిఎ మానుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
