ఇంజినీరింగ్ ఫీజులపై విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: ఫీజుల పెంపునకు నిరసనగా విద్యార్థి సంఘాల కార్యకర్తలు బుధవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాదులోని సాంకేతిక విద్యామండలి కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సాంకేతిక విద్యామండలి కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ కారణంగా స్వల్వ ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడలోనూ, గుంటూరులోనూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగును మంత్రి చెంగారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా రేపు బంద్ నిర్వహించాలని ఎఐఎస్ ఎఫ్ నిర్ణయించింది. బిసి విద్యార్థుల నుంచి ప్రత్యేక ఫీజులు, ట్యూషన్ ఫీజుల వాపసుకు మార్గదర్శకాలు విడుదల చేయాలని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
