మొద్దు శీనుకు జైలు శిక్ష, జరిమానా
హైదరాబాద్: అక్రమ ఆయుధాల కేసులో జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్ద శీనుకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. అక్రమ ఆయుధాల కేసులో మొద్దు శీనుకు మూడేళ్ల జైలు శిక్ష, మూడు వేల రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను నిందితుడు.
హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్డులో గల ఒక రెస్టారెంటులో మొద్దు శీనును 2003లో లైసెన్సులు లేని ఆయుధాలను కలిగి ఉన్నాడనే ఆరోపణపై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో పలువురు సాక్షులను విచారించిన కోర్టు మొద్దు శీనుకు శిక్ష విధించింది. మొద్దు శీను దాదాపు పది కేసుల్లో నిందితుడు. ఈ కేసులపై మొద్దు శీను కోర్టులకు హాజరవుతూనే ఉన్నాడు.












Click it and Unblock the Notifications
