ఏది చేసినా దేశం మేలుకే: ప్రధాని

ManMohan Singh
న్యూఢిల్లీ: తాను పదవి చేపట్టినప్పటి నుంచి ప్రతి పనీ దేశ ప్రయోజనాల కోసమే చేశానని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. లోకసభలో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సోమవారం చిన్నపాటి ప్రసంగం చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో నాలుగేళ్ల తర్వాత విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి రావడం విచారకరంగా ఉందని ఆయన అన్నారు.

సంకీర్ణ ప్రభుత్వానికి రూపకల్పన చేయడంలో వామపక్షాల నేతలు జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సూర్జీత్ పాత్ర విశేషమైందని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పూర్తి విశ్వాసంతోనే తాను ప్రతి నిర్ణయాన్ని, ప్రతి విధాన నిర్ణయాన్ని తీసుకున్నామని ఈ దేశానికి, ప్రజలకు హామీ ఇవ్వగలనని ఆయన అన్నారు. అణు ఒప్పందాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు ఆమోదించిన తర్వాత తప్పకుండా పార్లమెంటులో చర్చకు పెడతామని ఆయన చెప్పారు.

తాను జపాన్ లో ఉండగా వామపక్షాలు తమ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలు పూర్తి మద్దతు తెలియజేస్తారనే విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు. ఆయన ప్రసంగాన్ని యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రభుత్వ, ప్రతిపక్షాల నాయకులు శ్రద్ధగా విన్నారు. 21వ శతాబ్ది సవాళ్లన ఎదుర్కోవడానికి స్వాతంత్ర పోరాట, రాజీవ్ గాంధీ దృక్పథ వారసత్వాన్ని కొనసాగించడానికే ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+