యుపిఎకు జెఎంఎం మద్దతు
న్యూఢిల్లీ: ఇన్నాళ్ల సస్పెన్స్ కు జెఎంఎం నేత శిబూ సొరేన్ ఆదివారం తెర దించారు. ఈనెల 22వ తేదీన జరిగే బలపరీక్షలో యుపిఎకు అనుకూలంగా ఓటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తమ నలుగురు ఎంపిలతో కలిసి ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. ఐదగురం ఎంపిలం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆయన సోనియా గాంధీని కలిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కేంద్ర మంత్రివర్గంలో శిబూ సోరేన్ కు చోటు కల్పించి బొగ్గు గనుల శాఖను కేటాయిస్తామని, కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, ఆయన సహచరులను కూడా మంత్రివర్గంలో చేర్చుకుంటామని కాంగ్రెసు శిబూ సొరేన్ కు హామీ ఇచ్చింది. సహాయ మంత్రులుగా తీసుకునే ఎంపిల పేర్లను ఆయన వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications
