అణు ఒప్పందాన్ని ఆపాలి: మాయ

అమెరికాకు భారత్ ను బానిసగా చేయడానికే ఈ అణు ఒప్పందం పనికి వస్తుందని, తన ప్రయోజనాలను రక్షించుకుని దేశం తలెత్తుకుని నిలబడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రభుత్వం, ప్రధాని అణు ఒప్పందాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవద్దని, ఈ ఒప్పందాన్ని కొంత కాలం నిలిపేయాలని, ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయని, దాన్ని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి వదిలేయడం మంచిదని ఆమె అన్నారు. ఈ అణు ఒప్పందం 7.4 బిలియన్ డాలర్ల ఇరాన్ - పాకిస్తాన్ - భారత్ ల గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు విఘాతం కలిగిస్తుందని, అమెరికా టెహ్రాన్ పట్ల ప్రమాదకర పద్ధతిలో వ్యవహరిస్తోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
