ఓటింగుకు మమతా బెనర్జీ దూరం

అణు ఒప్పందానికి వెళ్లే ముందు కాంగ్రెస్ ప్రజల తీర్పు కోరాల్సి ఉండిందని ఆమె అన్నారు. అణు ఒప్పందంపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు అంత ఇష్టం వుంటే ప్రజల ఆమోదం తీసుకుని ఉండాల్సిందని, అందుకు ఎన్నికలను ఎంచుకోవాల్సిందని ఆమె అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం తాను రేపు జరిగే ఓటింగుకు దూరంగా ఉండదలుచుకున్నట్లు ఆమె తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆమె విమర్శించారు. నిత్యావసర ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం వాటిని అదుపు చేయడానికి బదులు అణు ఒప్పందం వివాదాన్ని ముందుకు తెచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
