న్యూఢిల్లీ: తాను 1998లో జరిగిన పోఖ్రాన్ -2 అణు పరీక్షలను వ్యతిరేకించలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. విశ్వాస తీర్మానంపై లోకసభలో చర్చ సందర్భంగా జోక్యం చేసుకుంటూ సోమవారం ఆయన ఆ విషయం చెప్పారు. 1988లో ఐక్య రాజ్యసమితి ముందు పెట్టిన నిరాయుధీకరణ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకునే అణు పరీక్షలపై తాను వ్యాఖ్యలు చేసినట్లు ఆయన తెలిపారు. తాను ఏం చెప్పాననే విషయం రికార్డుల్లో స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. బిజెపి సభ్యుడితో రాజ్యసభలో మన్మోహన్ సింగ్ వాదానికి దిగారని అద్వానీ గుర్తు చేశారు. ఈ వివాదం ఆంక్షల సందర్భానికి సంబంధించినవని ఆయన అన్నారు.