ప్రధాని చేత విశ్వాస తీర్మాన ప్రతిపాదన

సభలో మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన విలేకరులతో అన్నారు. ప్రధాని వచ్చిన పది నిమిషాల తర్వాత స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడడానికి నిరాకరించారు. సోమనాధ్ ఛటర్టీ స్పీకర్ గా కొనసాగడం మంచిది కాదని శివసేన నాయకుడు, మాజీ స్పీకర్ మరళీ మనోహర్ జోషీ అన్నారు. పార్టీ వల్లనే సోమనాధ్ ఛటర్టీ ఈ స్థాయికి చేరుకున్నారని, ఒకవేళ టై అయితే సోమనాధ్ కీలక పాత్ర పోషించాల్సి వస్తుందని ఆయన అన్నారు.
యుపిఎ ప్రభుత్వం విశ్వాస తీర్మానం నెగ్గుతుందని రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు చేసిన సిపిఐ నాయకుడు ఎ.బి. బర్దన్ పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
