మెజారిటీకి దగ్గరగా యుపిఎ

సమాజ్ వాదీ పార్టీ తన సభ్యులను చాలా మందిని ఐక్యంగా ఉంచుకోగలిగింది. ప్రస్తుతం ఎస్పీ సభ్యుల సంఖ్య 34 ఉంది. ఒక్కో ఎంపి ఉన్న పార్టీలు ఆరున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ (మజ్లీస్), బాలేశ్వర్ (ఎన్ఎల్పీ), డేల్కర్ (బిఎన్పీ), నాకుల్ రాయ్ (ఎస్డీఎఫ్), డబ్ల్యు వాంఘ్యూ (ఎన్పీఎఫ్), ఆథ్వాలే (ఆర్పీఐ -ఎ)లతో పాటు నలుగురు స్వతంత్రులు, ఇద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు, ఒక తెరాస తిరుగుబాడు సభ్యుడు, ఒక తిరుగుబాడు జెడి (యు) సభ్యుడు, ఒక బిజెపి తిరుగుబాటు సభ్యుడు యుపిఎకు అనుకూలంగా ఓటేయనున్నారు. దాంతో యుపిఎకు 271 మంది సభ్యుల బలం లభిస్తోంది.
ప్రతిపక్షాలకు చెందిన కొంత మంది సభ్యులు ఓటింగుకు దూరంగా ఉండవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక, గుజరాత్ లకు చెందిన బిజెపి ఎంపీలు, శివసేన, అకాలీ సభ్యులు కొంత మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయవచ్చునని భావిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మమతా బెనర్జీ ఓటింగుకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న సభ్యుల సంఖ్య 268 ఉంది. బిజెపి - 128, శివసేన - 12, బిజెడి - 11, అకాలీదళ్ -8, జెడి (యు) - 7, వామపక్షాలు - 59, బిఎస్పీ - 17, టిడిపి - 5, ఎస్పీ రెబెల్స్ - 5, ఆర్ఎల్డీ - 3, జెడి (ఎస్) - 3, ఎండిఎంకె - 2, తెరాస - 2, ఎజిపి - 2, హెచ్జెసి - 1, స్వతంత్రులు -2 ఎంఎన్ఎఫ్ - 1.












Click it and Unblock the Notifications
