ప్రభుత్వాన్ని కూలుస్తాం: అద్వానీ

LK Advani
న్యూఢిల్లీ: తాము ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయదలుచుకోలేదని, ప్రభుత్వాన్ని ఓడించాలనుకుంటున్నామని ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీ చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన సోమవారం చర్చను ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితికి కారణం ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఐసియులో ఉన్న రోగి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి ఆదేశం లేకుండా ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరని ఆయన అన్నారు.

అణు ఒప్పందం ఇద్దరు వ్యక్తులు బుష్ కు, మన్మోహన్ కు మధ్య జరిగే ఒప్పందంలా ఉందని, ఇలాంటి ఒప్పందం లేకపోవడం వల్లనే తాము గతంలో పోక్రాన్ అణు పరీక్షలు నిర్వహించగలిగామని ఆయన అన్నారు. ఇప్పుడు అణు శక్తి వాటా 3 శాతం మాత్రమేనని, ఒప్పందం వల్ల ఆరు శాతానికి మాత్రమే పెరుగుతుందని, దీని వల్ల ఇంధనం పెరుగుతుందనేది నిజం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం అణు ఒప్పందాన్ని తప్ప మరే విషయాన్నీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. విశ్వాస పరీక్షలో మన్మోహన్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. ఇన్నేళ్ల రాజకీయానుభవంలో ఇంత అస్థిర ప్రభుత్వాన్ని చూడలేదని ఆయన అన్నారు.

పార్లమెంటు అనుమతి లేకుండా అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు వెళ్లబోమని రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని, ఇప్పుడు మాట తప్పారని ఆయన అన్నారు. ఇంత కీలకమైన ఒప్పందానికి పార్లమెంటు అనుమతి అవసరం లేదా అని ఆయన అడిగారు. మెజారిటీ హిందువుల ప్రయోజనాలను కాలరాయడం సెక్యులరిజమా అని ఆయన అడిగారు. అణుశక్తి ప్రతి ఇంటికీ విద్యుత్తును అందించగలదన్న నమ్మకం ఏమిటని ఆయన అడిగారు. అద్వానీ ప్రసంగానికి అడ్డు తగిలేందుకు యుపిఎ పక్షాలు ప్రయత్నించాయి. దానికి స్పీకర్ సోమనాధ్ చటర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయాలను తీసుకోవడం సంప్రదాయమని, అయితే యుపిఎ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదని అద్వానీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+