యుపిఎకు ఓటేయలేదు: ఆదికేశవులు
న్యూఢిల్లీ: బలపరీక్ష తాను ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేశానని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు ఆదికేశవులు నాయుడు చెప్పారు. ఆదికేశవులు నాయుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆయన ఓటు చెల్లకుండా పోయింది. తాను పార్టీలో సంతృప్తిగానే ఉన్నానని ఆయన అన్నారు.
ఆదికేశవులు నాయుడు బుధవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని బిఎస్పీ నేత మాయావతి నివాసంలో కలుసుకున్నారు. తాను స్లిప్ తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేశానని ఆదికేశవులు నాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications
