8 మంది బిజెపి ఎంపిల బహిష్కరణ
న్యూఢిల్లీ: 8 మంది ఎంపిలను బిజెపి పార్టీ నుంచి బహిష్కరించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన తమ పార్టీ సభ్యులపై, సభకు గైర్హాజరైన సభ్యులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం అంతకు ముందు నిర్ణయించింది. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) అవినీతిపై, ప్రజాస్యామ్య విలువలను కాలరాయడంపై దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టాలని కూడా నిర్ణయించింది. క్రమశిక్షణా రాహిత్యాన్ని పార్టీ సహించబోదని, విప్ ను ధిక్కరించిన పార్లమెంటు సభ్యులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా చాలా మంది ఎంపిలు ఓటు వేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని నాయకుడొకరు చెప్పారు. తాను ప్రధాని కాకుండా అడ్డుకోవడానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) యుపిఎ ప్రభుత్వానికి సాయపడిందని మాయావతి చేసిన విమర్శలను పార్టీ ఖండించింది. ఆరుగురు బిజెపి ఎంపిలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. మరికొంత మంది పార్లమెంటుకు గైర్హాజరయ్యారు. పార్లమెంటు హౌస్ క్యాంటీన్ లో టీ సేవించడానికి వెళ్లిన ముగ్గురు బిజెపి ఎంపిలు ఓటింగుకు హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications
