కాంగ్రెసులోకి మందా జగన్నాథం
న్యూఢిల్లీ: పార్టీ విప్ ను ధిక్కరించి యుపిఎ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం కాంగ్రెసు గూటిలో చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన మంగళవారం జరిగిన బలపరీక్షలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. అణు ఒప్పందం మంచిదనే ఉద్దేశంతో మనస్సాక్షి మేరకు అలా ఓటు వేసినట్లు ఆయన చెబుతున్నారు. పార్టీలో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తాను చెప్పినా ప్రయోజనం లేదని మిన్నకున్నానని ఆయన అన్నారు. మహా మేధావి అయిన అబ్దుల్ కలామ్ ను రెండో సారి కూడా తాము రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించామని, అటువంటి మేధావి అణు ఒప్పందం మంచిదని చెప్పిన తర్వాత కూడా వినకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
అణు ఒప్పందంపై ప్రభుత్వాన్ని పడగొట్టడమనే విషయం కూడా తనకు నచ్చలేదని, చిన్న విషయంపై ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది సరికాదని అనిపించిందని ఆయన చెప్పారు. అణు ఇంధనం దేశానికి మంచిదని తాను భావించానని ఆయన అన్నారు. అణు ఒప్పందం పల్ల దేశ సార్వభౌమాధికారానికి వచ్చిన నష్టమేమీ లేదని, దేశానికి మేలే జరుగుతుందని కలామ్ చెప్పారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వ్యితిరేకంగా బలాలను సమీకరించే పద్ధతి కూడా తనకు నచ్చలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
