ఇద్దరు ఎంపిల అనర్హతకు లేఖ
న్యూఢిల్లీ: పార్టీ విప్ ను ధిక్కరించిన ఇద్దరు తమ పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని ఎండిఎంకె కోరే అవకాశం ఉంది. పార్టీ విప్ ను ధిక్కరించి ఇద్దరు ఎండిఎంకె పార్లమెంటు సభ్యులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా బలపరీక్షలో ఓటు వేశారు.
ఎల్. గణేషన్, జింజీ రామచంద్రన్ పార్టీ విప్ ను ధిక్కరించి యుపిఎ ప్రభుత్వానికి ఓటేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పార్టీ నాయకుడు సి. కృష్ణన్ లోకసభ స్పీకర్ సోమనాధ్ చటర్జీకి లేఖ రాసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఎంపిల గురించి పార్టీ నాయకుడు వైగో ఇప్పటికే స్పీకర్ కు తెలియజేశారు.












Click it and Unblock the Notifications
