మాయావతితోనే చంద్రులు

ఈ సమావేశంలో ప్రకాష్ కారత్ (సిపిఎం), ఎ.బి. బర్దన్, డి రాజా (సిపిఐ), హెచ్.డి. దేవెగౌడ (జెడిఎస్), జి. దేవరాజన్ (ఫార్వర్డ్ బ్లాక్), అబానీ రాయ్ (ఆర్ఎస్పీ), అజిత్ సింగ్ (ఆర్ఎల్డీ), నారా చంద్రబాబునాయుడు (టిడిపి), కె. చంద్రశేఖరరావు (తెరాస), అజయ్ చౌతాలా (ఐఎన్ఎల్డీ), బాబూలాల్ మారండీ (జార్ఖండ్ వికాస్ మోర్చా) పాల్గొన్నారు. మాయావతితో కలిసి పని చేయడం ద్వారా తమ పార్టీని పటిష్టం చేస్తామని సమావేశానికి ముందే కర్ణాటకకు బయలుదేరిన జెడిఎస్ నేత కుమారస్వామి అన్నారు. కర్ణాటకలో తృతీయ ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. బిఎస్పీతో తాము కలిసి పనిచేస్తామని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ అన్నారు. మాయావతితో పాటు ఆయన మీడియాకు దర్శనమిచ్చారు. తాము కలిసి పనిచేస్తామని హైదరాబాదుకు బయలుదేరుతూ ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
