క్రాస్ ఓటిందే ముంచింది: అద్వానీ
న్యూఢిల్లీ: క్రాస్ ఓటింగ్ వల్లనే ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) విశ్వాస పరీక్షలో నెగ్గిందని ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీ అన్నారు. క్రాస్ ఓటింగ్ జరగకపోతే యుపిఎ ఓడిపోయి ఉండేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. భారత పార్లమెంటు చరిత్రలో జులై 22 బ్లాక్ డేగా నిలిసిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటుకు గైర్హాజరయ్యేందుకు పార్లమెంటుకు లంచం ఇచ్చిన వ్యవహారంపై త్వరగా విచారణ జరిపించాలని ఆయన స్పీకర్ సోమనాథ్ ఛటర్జీని కోరారు. యుపిఎది కళంకిత విజయమని, ఫిరాయింపుల ద్వారా విజయం సాధించి దాన్ని తమ ఘన విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
