అహ్మదాబాద్ పేలుళ్ళు: మృతుల సంఖ్య 38
అహ్మదాబాద్:గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలో శనివారం రాత్రి వరుస పేలుళ్ళు సంభవించాయి. బెంగళూరు మాదిరి గానే తీవ్రత తక్కువ ఉన్న బాంబులనే ఉపయోగించినా అవి జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేలడంతో 38 మందికి పైగా మరణించగా, వందమంది గాయపడ్డారు. ఆరుగురు సభ్యులున్న ముఠా ఈ పేలుళ్ళకు పాల్పడినట్టు సమాచారం గుజరాత్ ప్రభుత్వం వద్ద ఉంది. అహ్మదాబాద్ లో మొత్తం 17 చోట్ల బాంబులు పేలాయి.
బిజెపి పాలిత రాష్ట్రాలపైనే ఉగ్రవాదులు గురిపెట్టినట్టు కన్పించినా తదుపరి టార్గెట్ హైదరాబాద్ అని నిఘా విభాగం హెచ్చరించింది. అహ్మదాబాద్ పేలుళ్ళ తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముంబయ్ లో విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ళకు, బెంగుళూరు పేలుళ్ళకు మధ్య సారూప్యం ఉంది. ఈ నెల 13 న జైపూర్ లో ఉపయోగించినట్టు అహ్మదాబాద్ లో సైకిళ్ళకు అమర్చిన టిఫిన్ బాక్సుల్లో పేలుడు పదార్ధాలను ఉంచారు.












Click it and Unblock the Notifications
