జార్ఖండ్ లో పేలుడు: 5గురికి గాయాలు
రాయపూర్: జార్ఖండ్ రాష్ట్రంలోని గొద్దాలోని బస్ స్టాండ్ వద్ద ఆదివారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. పేలుడు ఉదయం 5 గంటల 15 నిమిషాల ప్రాంతంలో జరిగిందని, ఇది బస్ స్టాండ్ వద్ద జరిగిందని పోలీసు సూపరింటిండెంట్ జితేంద్ర ప్రసాద్ చెప్పారు.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు, వారికి ప్రాణాపాయం ఏదీ లేదని ఆయన చెప్పారు. తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించిందని, దాని వల్ల నష్టం పెద్దగా జరగలేదని ఆయన అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
