పేలుళ్లు: కారు నెంబర్ ప్లేట్ లభ్యం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి పోలీసులు పేలుళ్లకు వాడిన కారు నెంబర్ ప్లేట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబరు జిజె6సిడి9718. అహ్మదాబాదులోని సివిల్ ఆస్పత్రి వద్ద జరిగిన పేలుళ్ల స్థలంలో ఈ నెంబర్ ప్లేటు దొరికింది. ఆ నెంబర్ గల కారునే ఆస్పత్రి వద్ద పేలుళ్లకు తీవ్రవాదులు వాడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో ఈ నెంబర్ ప్లేటు ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
బెంగుళూర్, అహ్మదాబాద్ పేలుళ్లు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. ఉగ్రవాదులు హైదరాబాద్, తదితర మెట్రో నగరాలను కూడా లక్ష్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా జరగవచ్చుననే భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications
