పిసిసి సమావేశంలో రాహుల్ గాంధీ
హైదరాబాద్: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఆదివారంనాడు హైదరాబాదులోని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ప్రత్యేక పిసిసి సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రానికి వచ్చారు.
గాంధీభవన్ నుంచి ఆయన జిల్లా కాంగ్రెస్ కమిటి (డిసిసి) అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపిల్లకు లక్షా 50 వేల రూపాయలు ఇవ్వాలని మహిళా కార్యకర్తలు రాహుల్ ను కోరారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం, రుణాల మాఫీ పథకం అమలు బాగుందని రాహుల్ అన్నారు. పిసిసి సమావేశానంతరం ఆయన మియాపూర్ లో ఏర్పాటైన యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరానికి బయలుదేరి వెళ్లారు. రాహుల్ పర్యటన కాంగ్రెసుకు ఉపయోగపడుతుందని మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.












Click it and Unblock the Notifications
