యాక్సెల్ తో ఎరాస్మిక్ విలీనం
బెంగళూరు: గతంలో భారతదేశంలో అతి తక్కువ వెంచర్ క్యాపిటలిస్టులు ఉండేవారు. ఇండియాలోని ప్రముఖ సీడ్ ఫండ్స్ లో ఎరాస్మిక్ ఒకటి. ఈ సంస్ధ యాక్సెల్ పార్ట్ నర్స్ సంస్ధతో విలీనమైంది,కొత్త సంస్ధ పేరు యాక్సెల్ ఇండియా వెంచర్ ఫండ్. ఇది భారతదేశం పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ప్రస్తుత భాగస్వాములు ప్రశాంత్ ప్రకాష్, సుబ్రతా మిత్రా, మహేంద్ర బాలచంద్రన్, గగన్ కుమార్ ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
యాక్సెల్ ఇండియా వెంచర్ ఫండ్ II 60 మిలియన్ డాలర్లను సేకరిస్తుందని ప్రశాంత్ ప్రకాష్ ధృవీకరించారు. యాక్సెల్ అమెరికాలో పెద్ద ఇన్వెస్టింగ్ సంస్ధ. ఈ విలీనం ద్వారా ఎరాస్మిక్ స్ధాయి పెరుగుతుంది. ఎక్సెల్ ఇండియా సెక్వొయియా కేపిటల్ తో సమానం ఉం టుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎరాస్మిక్ లో గూగుల్ వాటా ఉంది. గూగుల్ ఈ సంస్ధలో లక్ష నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టి ఉంటుందని అంచనా. న్యూ ఫండ్ ఇంటర్నెట్, మొబైల్, మీడీయా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడూలు పెట్టనుంది.












Click it and Unblock the Notifications