ఎవరినీ టార్గెట్ చేయడం లేదు: కమిషనర్

హైదరాబాద్: తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదని రాష్ట్ర రవాణా కమిషనర్ రేమండ్ పీటర్ స్పష్టం చేశారు. తాము దివాకర్ ట్రావెల్స్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నామనే ఆరోపణలను ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. తాము అన్ని సంస్థల బస్సులను టార్గెట్ చేశామని, నిబంధనలను పాటించని బస్సులపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. తాము నిర్వహించిన తనిఖీల్లో 12 బస్సులు పట్టుపడ్డాయని, ఇవి వివిధ ట్రావెల్స్ కు చెందినవని ఆయన చెప్పారు.

బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఓవర్ లోడింగ్ కూడా సరి కాదని ఆయన అన్నారు. బస్సుల్లో ఓవర్ లోడింగ్ విపరీతంగా జరుగుతోందని, సీట్లకు మధ్య ప్లాస్టిక్ కుర్చీలు వేసి తీసుకుపోతున్నారని ఆయన చెప్పారు. కడప, ఒంగోలు బస్సులు ఈ విధంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన చెప్పారు. తమకు ఎవరి మీదా కక్ష లేదని అదనపు కమిషనర్ గాంధీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+