కోల్ కతా: పార్టీ నిర్ణయంతో తీవ్రంగా గాయపడ్డానంటూ ...సీ పి ఎం నుండి బహిష్కృతుడైన సీనియర్ నేత ,లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆవేదన వ్యక్తం చేసారు.ఆయనను పార్టీ నుంచి వెలివేయటంతో తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారు. సీ పీ ఎం మాజీ నేత సైఫుద్ధీన్ చౌదరితో జరిగిన వ్యక్తిగత సంభాషణలో ఆయన ఆ విధంగా స్పందిచినట్లు తెలిసింది. పార్టీ వివ్ కు అనుగుణంగా తాను స్పీకర్ పదవికి రాజీనామా చేయకపోవడం వెనుక మతతత్వ శక్తుల వెనుక నిలబడి ఓటు వేయటం ఇష్టం లేకనే అని సోమనాధ్ చెప్పినట్లు తెలుస్తోంది.పార్టీ నిర్ణయం తనను తీవ్రంగా భాధించిందని,నలభైయేళ్ళ ఒక్క సారిగా తెగిపోవటం నమ్మలేకపోతున్నానని,ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ఎక్కువ కాలం పాల్గొనేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ప్రజాస్వామ్య పద్దతిలో ఎంపికైన ప్రభుత్వాన్ని అణు ఒప్పందం పేరిట పడగొడ్డాలని చూడటం తనకిష్టం లేదని సోమనాధ్ అభిప్రాయపడ్డారు.