అమర్ నాద్ వివాదం: ప్రభుత్వం చర్చలు

Amarnath Temple
జమ్ము: కాశ్మీర్‌లో రెండు నెలలుగా అమర్‌నాథ్ ఆలయ మండలికి కేటాయించిన భూమి గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది. ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్ర సంఘర్షణ సమితితో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చర్చలు బుధవారం అరంభమయ్యాయి. వంద ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం అమరనాథ్ ఆలయ మండలికి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై నెల కిందట వేర్పాటువాద సంస్థలు భారీగా ఆందోళనలకు దిగాయి. వీరి ధాటికి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే కూలిపోయింది. దీంతో ఆలయ మండలికి కేటాయించిన భూమిని రద్దు చేశారు.

భూమిని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమర్‌నాథ్ యాత్ర సంఘర్షణ సమితి అధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అమరనాథ్ ఆమయానికి తిరిగి భూమి కేటాయించాలని ఆ సంస్థ బంద్‌లకు దిగింది. దీంతో కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని నిర్ణయించింది. మొదట్లో ససేమిరా అన్న సంఘర్షణ సమితి ఎట్టకేలకు చర్చలకు అంగీకరించింది. దీంతో హోం శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ గోస్వామి, రాష్ట్ర డీజీపీ కులదీప్ కోడాలను ప్రభుత్వ ప్రతినిధులుగా నియమించారు. వీరు దాదాపు 30 హిందూ గ్రూపుల నుంచి వారి వారి ప్రతిపాదనలను స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+