సమైక్యవాదానికి టిడిపి స్వస్తి?

గురువారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుపై చర్చిస్తారు. ఈ విషయంపై కూడా పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీ కోసం యాత్ర ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతోంది. చంద్రబాబు మీ కోసం యాత్ర అనంతపురంలో ఆగస్టు 15వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ జరుగుతుంది. సమైక్యవాదానికి తెలుగుదేశం పార్టీ స్వస్తి చెప్పనుంది. ఇందుకు రాయలసీమ, కోస్తా పార్టీ నాయకుల నుంచి కూడా చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు జటిలం చేసిందని రావుల చంద్రశేఖర రెడ్డి విమర్శించారు. పార్టీకి, ప్రజలకు మేలు చేసే నిర్ణయం పార్టీ తీసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
