తిరుమల: నేడు 9 గంటల సేపు ఆలయం మూసివేత

గ్రహణం కారణంగా స్వామి వారి సేవల, దర్శన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చేశారు. అభిషేకం మినహా ప్రభాత సేవలైన తోమాల, అర్చన, నిజపాద దర్శనాలను రద్దు చేశారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు. ఈ కారణంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు అయ్యాయి. రాత్రి ఎనిమిదిన్నర తర్వాత స్వామి వారి సర్వ దర్శనం ప్రారంభమౌతుంది.












Click it and Unblock the Notifications
