తిరుపతి పోలీసుల అదుపులో ఇద్దరు
తిరుపతి: తిరుపతిలో పోలీసులు విస్తృత తనిఖీలు మొదలు పెట్టారు. బెంగుళూర్, అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు ఇల్లిల్లూ గాలిస్తున్నారు. ఈ సందర్భంలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వంద మంది పోలీసులు తిరుపతిలో ఇల్లిల్లూ గాలిస్తున్నారు. దీంతో తిరపతిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల నేపధ్యంలో రాజస్థాన్ పోలీసులు ఇటీవల గోపనేని రాజేంద్ర అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం అతన్ని వదిలేశారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా రాష్ట్రానికి సంబంధాలు ఉండడం ఇటీవలి కాలంలో ముందుకు వస్తున్న అంశం. ఈ పరిస్థితిలోనే పోలీసులు తిరుపతిలో గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా తిరుమలకు ఉగ్రవాదుల ప్రమాదం పొంచి ఉందని కూడా అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
