చిరంజీవి అభిమానుల ర్యాలీలు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆదివారంనాడు హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ర్యాలీ నిర్వహించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే అవినీతిని అంతం చేయగలరని, పేద వర్గాలకు చిరంజీవి రాజకీయాల వల్ల మేలు జరుగుతుందని చిరంజీవి అభిమానులు అన్నారు.
నెల్లూరులోనూ చిరంజీవి అభిమానులు ర్యాలీ నిర్వహించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే పేదలకు, బడుగు వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని వారన్నారు. పేదలకు మేలు జరగాలంటే చిరంజీవి రాజకీయాల్లోకి రావాల్సిందేనని వారన్నారు. ఆగస్టు మూడో వారంలో తన పార్టీని ప్రకటిస్తానని చిరంజీవి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
