సూరత్ లో మరో బాంబు స్వాధీనం
సూరత్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఆదివారంనాడు మరో లైవ్ బాంబు బయట పడింది. సూరత్ లోని అత్వాలీనెస్ ప్రాంతంలో ఈ పేలని బాంబు బయటపడింది. దీంతో సూరత్ లో బయటపడిన బాంబుల సంఖ్య 24కు చేరుకుంది. మున్సిపల్ గార్డెన్ పక్కన గల బస్ స్టాండ్ సమీపంలో ఒక సంచిలో ఈ బాంబు పెట్టి ఉంది. ఆ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఈ ప్రాంతంలో మరేమైనా బాంబులు పెట్టారా అనే విషయాన్ని కనుక్కోడవడానికి డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. సూరత్ లోని వరాచా ప్రాంతంలో పోలీసులు 23 బాంబులను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. పేలుడు పదార్థాలతో ఉన్న రెండు కార్లు కూడా పోలీసులకు చిక్కాయి. అయితే ఒక బాంబు కూడా పేలలేదు. బాంబులు దొరకడం మొదలు పెట్టినప్పటి నుంచి సూరత్ లో హై అలర్ట్ ప్రకటించారు. పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications
