ఆలయంలో తొక్కిసలాట: 50 మంది మృతి
బిలాస్ పూర్: హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 50 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. ఆలయం గోడ కూలడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐదుగురు భక్తులు మాత్రమే తొక్కిసలాటలో మరణించారని, ఆలయం ప్రహారిగోడ కూలిపోవడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసు ఇన్సెపెక్టర్ జనరల్ ఎస్ ఆర్ మర్దీ చెప్పారు.
సిమ్లాకు 60 కిలోమీటర్ల దూరంలో గల నైనా దేవి ఆలయానికి ఆదివారంనాడు వందలాదిగా భక్తులు వచ్చారు. కూలిన గోడ కింద వంద మంది దాకా చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నవరాత్రి సందర్భంగా పూజలు చేయడానికి భక్తులు వచ్చారు. సంఘటనా స్థలానికి బిలాస్ పూర్ నుంచి పోలీసు సూపరింటిండెంట్ కె కె ఇందోరియాతో పాటు జిల్లా అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. బిలాస్ పూర్ జిల్లా కేంద్రానికి నైనాదేవి ఆలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications
