పత్రికల మీద కోపం లేదు: వైయస్
హైదరాబాద్: తనకు ఏ పత్రిక మీద కూడా కోపం లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తుంటే ఆ విషయాలను తాను ప్రజల్లోకి తీసికెళ్తున్నానని ఆయన అన్నారు. ప్రెస్ అకాడమీ ఐదో పాలక మండలి సమావేశంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. తాము దశాబ్దాలుగా వ్యతిరేకమని ఓ పత్రిక హైకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన అన్నారు.
పత్రికలతో పెట్టుకుంటే తిప్పలు తప్పవని కొందరు శ్రేయోభిలాషులు హెచ్చరించినా తాను వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై ఆయన వీలు దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జర్నలిస్టులు వాస్తవాలు రాస్తూ పేదల పక్షాన నిలవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
