పార్టీపై 26 న చిరంజీవి ప్రకటన?
హైదరాబాద్: చిరంజీవి తన పార్టీ గురించి ఆగస్టు 26 న ప్రకటిస్తారని తాజా సమాచారం. ఆగస్టులోనే ప్రకటన ఉంటుందన్న సమాచారం తప్ప మరేదీ లేదు. చిరంజీవి అభిమాన సంఘాలకు కూడా సరైన సమాచారం లేదు.
మెగా సస్పెన్స్ కారణంగా చిరంజీవి అభిమానుల్లో ఎడతెగని ఉత్కంఠ, అదే సమయంలో నిరాశ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్ధితి మెగాస్టార్ దృష్టికి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చల్లబడిన అభిమానులను ఉత్సాహపరచడానికి మెగాస్టార్ వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం.
చిరంజీవి ఫలానా తేదీ నాడే రాజకీయ ప్రకటన చేయాలన్న విషయం మీద జ్యోతిష శాస్త్రవేత్తల్లో ఏకాభిప్రాయం లేదు. చిరంజీవి ఏ జ్యోతిషుడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications
