రామానాయుడు ఫిలిం స్కూల్
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత రామానాయుడు పేరుతో హైదరాబాదులో ఫిలిం స్కూల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కుమారుడు, సినీ నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరులో ఈ స్కూల్ ప్రారంభమవుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. శిక్షణ ఇచ్చేందుకు 25 మందిని తీసుకుంటామని ఆయన చెప్పారు.
విద్యార్థులకు దర్శకత్వంలో, స్క్రిప్టు రైటింగులో శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పిస్తామని కూడా ఆయన చెప్పారు. రామానాయుడు భారతదేశంలోని పలు భాషల్లో చిత్రాలు నిర్మించారు. ఆయన పేర హైదరాబాదులో సినిమా స్టూడియో కూడా ఉంది.












Click it and Unblock the Notifications
