షారూఖ్ పై మనోజ్ కుమార్ కేసు
ముంబయి: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ పై, నిర్మాత, దర్శకుడు ఫర్హా ఖాన్ పై, సోనీ ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్ పై పాత తరం నటుడు మనోజ్ కుమార్ కేసు దాఖలు చేశారు. ఓం శాంతి ఓం సినిమాలోని దృశ్యాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ కేసు దాఖలు చేశారు. తనను కించపరిచే విధంగా ఉన్న దశ్యాన్ని తొలగిస్తామని తనకు హామీ ఇచ్చారని, కానీ తొలగించలేదని మనోజ్ కుమార్ అన్నారు.
ఆ దృశ్యాన్ని తొలగించకుండానే సినిమాను అన్ని థియేటర్లలో ప్రదర్శించారని ఆయన అన్నారు. ఈ సినిమా ప్రసారంపై స్టే ఇవ్వాలని కోరుతూ మనోజ్ కుమార్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా సోనీ ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్ లో ఈ నెల 10వ తేదీన ప్రసారం కానుంది. మనోజ్ కుమార్ పిటిషన్ పై బుధవారం విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications
