అహ్మదాబాద్ పోలీసుల వద్ద స్కెచ్ లు
అహ్మదాబాద్: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసును పరిష్కరించడానికి అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు జైపూర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన స్కెచ్ లను తెప్పించుకున్నారు. అహ్మదాబాద్ పేలుళ్లకు సంబందించి 7గురు అనుమానితుల స్కెచ్ లను తెప్పించుకున్నారు. అహ్మదాబాద్ బాంబు పేలుళ్లలో వారి పాత్ర ఏ మేరకు ఉన్నదనే విషయాన్ని పరిశీలిస్తున్నామని జాయింట్ పోలీసు కమీషనర్ ఆశిష్ భాటియా చెప్పారు. ఆ స్కెచ్ లను నిపుణులు పరిశీలిస్తారని, వాటిని ప్రత్యక్ష సాక్షులకు చూపుతామని ఆయన అన్నారు.
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో పోలీసులు ఇప్పటికే మూడు స్కెచ్ లను తయారు చేశారు. పోలీసులు అహ్మదాబాదులోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 155 మందిని పోలీసులు ప్రశ్నించారు. సూరత్ పోలీసులు కూడా పలువురులు వ్యక్తులను ప్రశ్నించారు. తాము కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, అయితే కొంత ముందడుగు సాధించామని సూరత్ పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
