అల్లు అరవింద్ తో మిత్రాకు విభేదాలు?

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులకు, ఆయన రాజకీయ సలహాదారు డాక్టర్ మిత్రాకు మధ్య అప్పుడే విభేదాలు ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి తన పార్టీ గురించి అధికారికంగా ప్రకటించకముందే ఈ విధమైన ప్రచారం జరగడం ఆశ్చరం కలిగిస్తోంది. చిరంజీవి పార్టీని ప్రకటించి, విధివిధానాలను వెల్లడించి, ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కు, మిత్రాకు మధ్య విభేదాలు పొడసూపినట్లు వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి పార్టీతో మిత్రా అనుబంధం అల్లు అరవింద్ కు నచ్చడం లేదట. అందువల్లనే విభేదాలు మొదలైనట్లు వదంతులు ఊపందుకుంటున్నాయి. తాను బయటకు రావాల్సి వస్తే మిత్రా ఏమంటారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. చిరంజీవి పార్టీ మొత్తం కుటుంబ వ్యవహారంగా మారిందనే విమర్శలు చెలరేగే అవకాశం ఉంది. అయితే మిత్రాకు పార్లమెంటరీ రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోవడం కూడా సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+