సిమి నిషేధం ఎత్తివేతపై సుప్రీం స్టే
సిమి నిషేధం ఎత్తివేతపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై ప్రత్యేక ట్రిబ్యునల్ ఎత్తివేసిన నిషేధంపై సుప్రీంకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది.
సిమికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. సిమిపై నిషేధాన్ని పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు న్యాయమూర్తి గీతా మిట్టల్ తో కూడిన ట్రిబ్యునల్ మంగళవారంనాడు కొట్టేసింది. సిమిపై నిషేధాన్ని సమర్థించుకోవడానికి ప్రభుత్వం తాజా నిదర్శనాలను చూపలేదని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications