చేనేత రుణాల మాఫీకి ఒప్పిస్తాం: వైయస్
హైదరాబాద్: చేనేత సహకార సంఘాల రుణాల మాఫీకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఈ విషయంపై తాను ఇది వరకే రెండు సార్లు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో మాట్లాడానని, మరోసారి మాట్లాడేందుకు తమ మంత్రులను పంపుతామని ఆయన చెప్పారు. ఆప్కో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గురువారం ప్రసంగించారు.
చేనేత కార్మికులకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని, క్రెడిట్ కార్డుల ద్వారా ఆ రుణాలను కార్మికులు వినియోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. దీని ద్వారా లక్షా 80 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ఆర్థిక మంత్రి కె. రోశయ్య ఈ కార్యక్రమంలో ప్రశంసించారు. ముఖ్యమంత్రి అడగందే అన్నీ ఇచ్చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications