Israel: ఒక్క దెబ్బతో అమెరికా-ఇరాన్ డీల్ ను నీరుగార్చేసిన ఇజ్రాయెల్..!

ఐదు నెలలుగా అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్ పై జరిపిన దాడులు, ఇందుకు ప్రతిగా ఆ దేశం జరుపుతున్న దాడులకు తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం (US-Iran Deal)తో అధికారికంగా బ్రేక్ పడింది. ఇది ఇష్టం లేని ఇజ్రాయెల్ (Israel) ఇప్పటికే అమెరికాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. అలాగే ఈ ఒప్పందాన్ని నీరుగార్చే ప్రయత్నాలను కూడా మొదలుపెట్టేసింది. ఇరాన్ డీల్ లో భాగంగా లెబనాన్ (Lebanon) పై దాడులు చేయకూడదన్న షరతును పక్కనబెడుతూ ఇవాళ ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇందులో 16 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఎవ్వరి మాటా వినని ఇజ్రాయెల్.. ఇప్పుడు మరో దేశంపైకి దండయాత్ర..!!
ఎవ్వరి మాటా వినని ఇజ్రాయెల్.. ఇప్పుడు మరో దేశంపైకి దండయాత్ర..!!

దక్షిణ లెబనాన్‌పై ఇవాళ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 16 మంది చనిపోయారు. రాత్రిపూట పలు ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు, ఆ ప్రాంతమంతటా తమ దాడులను కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. నిన్న ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్-అమెరికాల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత జరిగిన రెండవ దాడి ఇది. ఈ ఒప్పందం ప్రకారంఇరాన్‌పై, లెబనాన్‌తో సహా అన్ని రంగాలలోనూ అన్ని సైనిక చర్యలను నిలిపివేయాలి. కానీ దక్షిణ లెబనాన్‌లోని ఇరాన్ సరిహద్దులో ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

Israeli Strikes Kill 16 in Lebanon Despite US-Iran Peace Deal
ఇరాన్ డీల్ పై ట్రంప్ యూటర్న్..! మళ్లీ బాంబులేస్తామని హెచ్చరిక..!
ఇరాన్ డీల్ పై ట్రంప్ యూటర్న్..! మళ్లీ బాంబులేస్తామని హెచ్చరిక..!

ఇరాన్ మద్దతు ఉన్న ఈ సంస్థ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోందని, దానికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరిపినట్లు చెబుతోంది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై రాత్రిపూట దాడులు జరిపినట్లు, ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇరాన్‌తో దాదాపు 4 నెలలుగా సాగుతున్న సంఘర్షణను ముగించేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాతి రోజే మన చర్చలు సజావుగా సాగేందుకు మధ్యప్రాచ్య ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ తమ నిబద్ధతను కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నామని ట్రంప్ తెలిపారు. కానీ ఇజ్రాయెల్ ఇవాళ ట్రంప్ ప్రకటన డొల్లతనాన్ని బయటపెట్టింది. ఒప్పందంలోని ఏవైనా నిబంధనలు లేదా షరతులను ఉల్లంఘిస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ స్పీకర్ మహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్ ఇప్పటికే హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+