AP SSC Advanced Supplementary Results: పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల..!

ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో తప్పిన వారు, బెటర్మెంట్ కోరుకున్న వారి కోసం నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (AP SSC Advanced Supplementary Results) ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఎలా తెలుసుకోవచ్చో కూడా వివరాలు ఇచ్చారు.

మే 2026లో నిర్వహించిన ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (ASE) ఫలితాలను ప్రకటించడం సంతోషంగా ఉందని లోకేష్ ఇవాళ ట్వీట్ చేసారు. ఈ పరీక్షలకు హాజరైన 94,990 మంది విద్యార్థులలో 78,261 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. దీనివల్ల ఉత్తీర్ణత శాతం 82.39%గా నమోదైందని వెల్లడించారు. ఇది గత ఏడాది ఉన్న 76.14%తో పోలిస్తే 6.25 శాతం పాయింట్ల పెరుగుదలతో కూడిన గణనీయమైన పురోగతి అన్నారు.

AP SSC Advanced Supplementary Results Out 78 261 Students Clear Exam

SSC పబ్లిక్ పరీక్షల తర్వాత విద్యార్థులకు ప్రత్యేక విద్యాపరమైన మద్దతు, విస్తృతమైన శిక్షణ, వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందించిన ప్రభుత్వం యొక్క '20-రోజుల కార్యాచరణ ప్రణాళిక' (20-Day Action Plan) విజయవంతమైందని ఈ ప్రోత్సాహకరమైన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని లోకేష్ తెలిపారు. ఈ విజయం సాధ్యం కావడానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకుల కృషి, అంకితభావానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థులందరూ తమ విద్యా ప్రయాణంలోనూ, భవిష్యత్తు ప్రయత్నాలలోనూ నిరంతర విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చని లోకేష్ తెలిపారు.

📱 Mana Mitra WhatsApp Governance (95523 00009)
📱 LEAP Mobile App
💻 https://results.bse.ap.gov.in
📄 DigiLocker

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+