భారీ భూకంపం- వణికిన తూర్పు తీరం

రష్యా తూర్పు తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ మహాసముద్ర పరిధిలోని కమ్‌చట్కా ద్వీపకల్పంలో కొద్దిసేపటి కిందటే ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.6 గా రికార్డయినట్లు అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ వెల్లడించింది. రష్యాలోని పెట్రోపావ్‌లోవ్‌స్క్-కమ్‌చట్క్సకా నగరానికి ఆగ్నేయంగా దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6: 51 నిమిషాలకు భూమి ప్రకోపించింది. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించడంతో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు భూ ఉపరితలంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ శక్తివంతమైన ప్రకంపనల ధాటికి పెట్రోపావ్‌లోవ్‌స్క్-కమ్‌చట్స్కాలోని నివాసితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Earthquake Magnitude 6 6 Earthquake Strikes 185 km South East of Petropavlovsk-Kamchatsky Russia

భూకంపం వచ్చిన సమయంలో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీనివల్ల తక్షణమే ఎలాంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం (NTWC) ఈ విషయాన్ని ధృవీకరించింది. అలస్కా, బ్రిటిష్ కొలంబియా, అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది.

మరోవైపు రష్యా విపత్తు నిర్వహణ శాఖ ఈ భూకంపంపై తక్షణమే స్పందించింది. భూకంపం సంభవించిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు ప్రభావిత తీరప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అయినప్పటికీ, సముద్రంలో సంభవించిన ఈ భూకంపం తర్వాత తేలికపాటి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని స్థానికులను హెచ్చరించారు.

ఈ భూకంపం సంభవించిన కమ్‌చట్స్కా ద్వీపకల్పం భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇది పసిఫిక్ మహాసముద్రపు 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) పరిధిలోకి వస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు, తీవ్రమైన అగ్నిపర్వత పేలుళ్లు సంభవించే ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. ఇక్కడ భూమి అంతర్భాగంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉండటం వల్ల తరచుగా భారీ అలజడులు రేగుతుంటాయి. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+