మరో రెండు రోజులు భారీ వర్షాలు
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్ధిరంగా కొనసాగుతోంది.ప్రస్తుతం ఒరిస్సా,పశ్చిమ బెంగాళ్ తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించి ఉంది.మరోవైపు బంగాళాఖాతంలో అండమాన్ వరకూ ఆవరించిన దట్టమైన మేఘాల కారణంగా అల్పపీడనం మరింత బలపడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణా,ఒరిస్సా లతో పాటు కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.మరో రెండు మూడు రోజులు పాటు ఈ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసే అవకాశముందని అన్నారు.












Click it and Unblock the Notifications