వర్ష బీభత్సం: 16 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల 16 మంది మరణించినట్టు ప్రాధమిక సమాచారం. హైదరాబాద్ లో జలప్రళయం తీవ్రంగా ఉంది. పాతబస్తీలో వర్షాల కారణంగా ముగ్గురు మరణించినట్టు హైదరాబాద్ కలెక్టర్ ధృవీకరించారు. హైదరాబాద్ నగరంలో మొత్తం ఏడుగురు మరణించినట్టు కలెక్టర్ చెబుతుండగా, అనధికారిక అంచనాల ప్రకారం ఈ సంఖ్య తొమ్మిది ఉండవచ్చని చెబుతున్నారు.
విజయవాడలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మరణించినట్టు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావం మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మరో 48 గంటల పాటు రాష్ట్రానికి జలప్రళయం ఉండవచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications