న్యూఢిల్లీ: భారతీయ రైల్వేల బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన బింద్రాను నియమించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సూచనప్రాయంగా చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తుండగా భింద్రాకు రైల్వే శాఖ ఎటువంటి నగదు బహుమతులు ప్రకటించలేదేమనీ అడగ్గా, డబ్బే ప్రధానం కాదు కదా అని లాలూ నర్మగర్భంగా వ్యాఖ్యానించడంతో విలేకరులు లాలూ భింద్రాకు ఏదో ఇంకా గొప్పదే చేస్తారని అనుకున్నారు. భింద్రాకు ఉన్నత స్ధాయి ఉద్యోగం ఇచ్చే విషయంలో పరిశీలనలో ఉందని లాలూ చెప్పడంతో అది రైల్వే బ్రాండ్ అంబాసిడర్ పోస్టేనని ఊహాగానాలు చెలరేగాయి